సాక్షి, హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను నిలిపివేయాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేయడంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి స్పందించారు. దీనిపై మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను ఆపడం సరికాదని అన్నారు. ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నిజాలు బయటకు వస్తాయనే ఈ సినిమాను ఆపాలని చూస్తున్నారని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అని నిలదీశారు.(‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఈసీకి ఫిర్యాదు)
కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను నిలిపివేయాలని టీడీపీ నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లపై సినిమా ప్రభావం ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమాను నిలిపివేయాలని కోరారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆ చిత్ర దర్శకుడు వర్మ చంద్రబాబును విలన్‌గా చూపిస్తున్నారని టీడీపీ భావిస్తోందన్నారు. టీడీపీ నేతలు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలని.. నిజాన్ని ఎప్పుడు ఎవరు దాచలేరని తెలిపారు. కాగా, ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల ఆదారం తెరకెక్కించిన చిత్రాన్ని.. ఎట్టి పరిస్థితుల్లోను అనుకున్న సమయానికి(మార్చి 22న) విడుదల చేస్తానని వర్మ ప్రకటించేశాడు. తాజాగా టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment