ఎన్నో అవాంతరాల తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో తప్ప మిగతా అన్ని చోట్లా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా ప్రమోషన్‌లో వర్మ తీసుకున్న జాగ్రత్తలతో పాటు ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనల్లోని అసలు నిజం తెలుసుకునేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
(చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ)
తొలి షో నుంచే సినిమాకు పాజిటిల్ టాక్ రావటంతో కలెక్షన్లు కూడా భారీగా ఉన్నాయి. చాలా థియేటర్లలో కథానాయకుడు సినిమా కలెక్షన్ల కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ వసూళ్లే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక మహానాయకుడైతే ఈ సినిమా దరిదాపుల్లో కూడా లేదు. అంతేకాదు ప్రముఖ ఫిలిం వెబ్ సైట్ ఐయండీబీ లో ట్రెండింగ్ తెలుగు మూవీస్ లిస్ట్(రియల్ టైం పాపులారిటీ)లో లక్ష్మీస్ ఎన్టీఆర్ టాప్ లో నిలిచింది. 54.2% పేజ్ వ్యూస్‌తో బాహుబలి, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలను కూడా వెనక్కి నెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ సాధించటం విశేషం. ఇదే లిస్ట్‌లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించారు.
సినిమాను ఆపేందుకు ఎన్ని కుట్రలు చేసిన ప్రేక్షకులు మాత్రం సినిమాను సూపర్‌హిట్ చేయటం పట్ట చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ చేసేందుకు చట్టపరమైన అవకాశాలపై చర్చిస్తున్న వర్మ రెండు మూడు రోజుల్లోనే అక్కడ కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడించారు.
— Ram Gopal Varma (@RGVzoomin) 29 March 2019
— Ram Gopal Varma (@RGVzoomin) 29 March 2019
Comments
Please login to add a commentAdd a comment