
వెన్నుపోటు పాటతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన రామ్ గోపాల్ వర్మ వివాదాన్ని మరింత పెద్దది చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ పాట విషయంలో టీడీపీ శ్రేణులు మండిపడుతుంటే పుండు మీద కారం చల్లినట్టుగా మరిన్ని ట్వీట్లు చేశాడు. తనకు వార్నింగ్‌లు ఇచ్చిన వారి వీడియోలను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తూ ఇలాంటి వాటికి భయపడేది లేదన్నాడు.
అంతేకాదు తనపై టీడీపీ శ్రేణులు కేసులు వేయటంపై కూడా వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. గతంలో ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోను తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ ‘నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ...అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?’ అంటూ కామెంట్ చేశాడు. ముందు ముందు ఈ వివాదం ఇంకెన్నీ మలుపులు తిరుగుతుందో చూడాలి.
నేను CBN గారిని డైరెక్ట్ గా ఒక్కమాట కూడా అనలేదు ...అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్ గా దూషించిన ఈ క్రింది వీడియో లోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి ?https://t.co/j70bgc1QhW
— Ram Gopal Varma (@RGVzoomin) 23 December 2018
Comments
Please login to add a commentAdd a comment