‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ క్రేజ్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌లో రికార్డ్‌ | 1000 Tickets of Lakshmis NTR Sold With in 10 Mins of Booking of One Theatre | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ క్రేజ్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌లో రికార్డ్‌

Published Wed, Mar 27 2019 11:27 AM | Last Updated on Wed, Mar 27 2019 11:27 AM

1000 Tickets of Lakshmis NTR Sold With in 10 Mins of Booking of One Theatre - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక సంఘటనలకు సంబంధించిన అసలు నిజాలను ఈ సినిమాతో బయటపెడతానని వర్మ చెప్పటం, టీడీపీ నాయకులు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి మరింతగా పెరిగింది. ఆ క్రేజ్‌ టికెట్ల అమ్మకాల్లోనూ కనిపిస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

బుకింగ్స్‌ ప్రారంభించిన 10 నిమిషాల్లో కేవలం ఒక్క థియేటర్‌లోనే 1000 టికెట్లు అమ్ముడైనట్టుగా వెల్లడించాడు వర్మ. ‘ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. హైదరాబాద్‌లోని ఏయంబీ సినిమాలో బుకింగ్స్‌ కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను కూడా జోడించాడు వర్మ. టికెట్స్‌ కొన్నవారందరూ అసలైన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అన్నారు వర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement