‘ఎన్టీఆర్‌ కథానాయకుడో.. మహానాయకుడో కాదు’ | Ram Gopal Varma Lakshmis Ntr Trailer Launch Date And Time | Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌ కథానాయకుడో.. మహానాయకుడో కాదు’

Published Sun, Feb 10 2019 9:40 AM | Last Updated on Sun, Feb 10 2019 1:51 PM

Ram Gopal Varma Lakshmis Ntr Trailer Launch Date And Time - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశాడు వర్మ. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా పోస్టర్స్‌ రిలీజ్‌ చేసిన వర్మ ఎన్టీఆర్‌ కథానాయకుడు కాదు.. మహానాయకుడు కాదు. ఆయన అసలు నాయకుడు కానీ ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అసలు సిసలు నాయకుడు అంటూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను వ్యతిరేకిస్తున్న వారికి మరోసారి తనదైన స్టైల్‌ చురకలంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement