వర్మ నుంచి మరో సెన్సేషనల్‌ బయోపిక్‌ | RGV Announced Sasikala Biopic Movie | Sakshi
Sakshi News home page

వర్మ నుంచి మరో సెన్సేషనల్‌ బయోపిక్‌

Published Sun, Mar 31 2019 7:58 PM | Last Updated on Sun, Mar 31 2019 8:00 PM

RGV Announced Sasikala Biopic Movie - Sakshi

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో వేడి పుట్టించిన రామ్‌ గోపాల్‌ వర్మ.. చాలాకాలం తరువాత విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ సాధించడంతో ఆర్జీవీ అభిమానులు కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ హిట్‌ కొట్టడంతో ఫామ్‌లోకి వచ్చిన ఆర్జీవీ.. మరో బయోపిక్‌ను టేకప్‌ చేశారు. తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

శశికళ పేరుతో రాబోతోన్న ఈ చిత్రంలో .. శశికళకు జైలు శిక్ష, మన్నార్‌గుడి మాఫియాలను హైలెట్‌ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కబోతోన్నట్లు సమాచారం. కాసేపటి క్రితమే అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన ఆర్జీవీ.. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సోషల్‌ మీడియాలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement