సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమానే అసలైన బయోపిక్ అంటున్నారు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఎలా లాక్కున్నారో ఈ సినిమా ద్వారా తెలుస్తోందని ఆమె అన్నారు.