తనకు జరిగిన అన్యాయంపై సినిమా రావడం ఆనందంగా ఉందని దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ‘ఆ మహానుభావుడి అసలు చరిత్రను ఎవరూ బయటకి తీస్తలేరని బాధపడేదానిని. 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను అసలు చరిత్ర తెలపాలని. చివరి రోజుల్లో ఆయనకు జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఆరోజు జరిగిన అవమానం తెలుగు ప్రజలకు తెలిపేలా సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తెలియదు.