సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. తొలి ట్రైలర్‌లో ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలను చూపించిన వర్మ తాజా ట్రైలర్‌లో లక్ష్మీ పార్వతి ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల మీద దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్‌కు దగ్గరైన తరువాత లక్ష్మీ పార్వతిని.. ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు ఎలా అవమానించారు, ఆమె మీద ఎలాంటి విష ప్రచారం చేశారు అన్న విషయాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘వాడూ నా పిల్లలూ కలిసి, నన్ను చంపేశారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభించిన వర్మ తరువాత ఎన్టీఆర్ వెన్నుపోటు కారణమైన పరిణామాలను చూపించాడు.