
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీకి షాక్‌ల మీద షాకులు ఇస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు చేశానంటున్న వర్మ, మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను టీడీపీ వర్గాలు అడ్డుకోవటంతో వర్మ రగిలిపోతున్నాడు. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో గుబులు పుట్టించే ట్వీట్ చేశాడు వర్మ.
ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూసిన తరువాతే చంద్రబాబుకు ఓటు వేయాలని కోరారు. నారా లోకేష్ టీడీపీకి నిజమైన వారసుడు కాదన్న వర్మ.. జూనియర్ ఎన్టీఆరే అసలైన వారసుడని పేర్కొన్నాడు. అంతేకాదు టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియరే అన్నాడు వర్మ.
ఇక సినిమా విషయానికి వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ చేయించేందుకు వర్మ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించగా, తాజాగా డిస్ట్రిబ్యూటర్‌లు కూడా సినిమా రిలీజ్‌పై స్టే విదించటంతో తమకు కలిగిన నష్టాన్ని హైకోర్టుకు నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
All truly real and realistic honest fans of NTR and @tarak9999 should cast their vote only after seeing @ncbn in #LakshmisNTR ..@naralokesh is a false heir to @jaiTDP and only true heir is the fantastic @tarak9999
— Ram Gopal Varma (@RGVzoomin) 2 April 2019
who should be the only true honest future of TDP
Comments
Please login to add a commentAdd a comment