వ్యూహం, శపథం చిత్రాలు వాయిదా.. కారణం ఇదే | RGV Vyooham And Shapadham Movie Again Postponed, Know Reasons Inside - Sakshi
Sakshi News home page

Vyooham Shapadham Release Postponed: వ్యూహం, శపథం చిత్రాలు వాయిదా.. కారణం ఇదే

Published Thu, Feb 22 2024 7:27 PM | Last Updated on Thu, Feb 22 2024 7:54 PM

Vyuha And Sapatham Movie Again Postponed - Sakshi

'వ్యూహం, శపథం' చిత్రాలు వాయిదా పడినట్లు డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఇప్పటికే 'వ్యూహం' సినిమా ఫిబ్రవరి 23న విడుదల అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి 1న వ్యూహం.. మార్చి 8న శపథం విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సారి కారణం లోకేష్‌ కాదని వర్మ తెలిపారు. ఫిబ్రవరి 23న సుమారు 9 సినిమాలు విడుదల కానున్నడంతో 'వ్యూహం' సినిమాకు అనుకున్నన్ని థియేటర్‌లు దొరకడం కష్టం కావడంతో వాయిదా వేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రాల్లో  అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన 'వ్యూహం' సినిమా లోకేష్‌ కారణంగా ఎన్నికల ముందు విడుదల అవుతుందని ఇప్పటికే వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. 

'వ్యూహం' సినిమా విషయంలో కోర్టు, సెన్సార్‌ చిక్కులతో అందరిలోనూ ఆసక్తి పెంచిన వర్మ.. తాజాగా సినిమా విడుదలను మరో వారం వాయిదా వేసి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సమయంలో వ్యూహం, శపథం చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలపై మరింత ఆసక్తిని వర్మ పెంచారని చెప్పవచ్చు. మార్చి 1న 'వ్యూహం'.. మార్చి 8న 'శపథం' విడుదల కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement