పవర్‌ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు హిట్ కావడం సహజం. అందుకు యాత్ర, యాత్ర 2 చిత్రాలే నిదర్శనం. వైఎస్సార్, వైఎస్ జగన్‌ల పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక త్వరలోనే వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం, శపథం చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రాల్లో అజ్మల్, మానస ముఖ్య పాత్రలు పోషించారు. వ్యూహం ఫిబ్రవరి 23న విడుదల అవుతుండగా, దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'శపథం' మార్చి 1న విడుదల కానుంది.
‘వ్యూహం’, ‘శపథం’ ల కథేంటి?
వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారిని సీఎం కాకుండా ఎవరు వ్యూహం రచించారు..? సీఎం అయ్యే క్రమంలో వైఎస్ జగన్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు..? ఈ పొలిటికల్ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారు..? చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? ఇలా అనేక సందేహాలకు ఈ చిత్రాలలో చూపించనున్నారు. పార్ట్ -2 'శపథం'లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఏపీ రాజకీయాల్లో ఎలాంటి కుట్రలు మొదలయ్యాయి.. పవన్‌తో కలిసి చంద్రబాబు ప్లే చేసిన గేమ్స్ వంటి అంశాలతో పాటు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం వరకు శపథం ఉంటుంది.
లోకేష్ ఎంత తెలివైనోడంటే: ఆర్జీవీ
వ్యూహం చిత్రం ట్రైలర్‌తో టీడీపీ బ్యాచ్‌ను ఆర్జీవీ షేక్ చేశారు. దీంతో వ్యూహం సినిమాను ఆపాలని నారా లోకేష్ ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. చివరకు సెన్సార్ బోర్డుతో పాటు కోర్డు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అయింది. లోకేష్ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల తనకు మరింత కలిసొచ్చిందని లోకేష్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు వర్మ.
ఆ సమయంలా వర్మ ఇలా ఆన్నాడు 'డిసెంబర్‌లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ లోకేష్ తన బుర్ర వాడి ఈ సినిమాను సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ అయ్యేలా చేశాడు. లోకేష్ ఎంత తెలివైనోడంటే, డిసెంబర్‌లోనే ఈ సినిమా రిలీజై ఉంటే ఈపాటికి కొందరు మరిచిపోయేవారు. కానీ లోకేష్ సరైన వ్యూహం పన్ని ఎలక్షన్ల టైమ్‌లో వ్యూహం రిలీజ్ అయ్యేలా చేశాడు. అది లోకేష్ తెలివి. అందుకే లోకేష్‌కు ముద్దు ఇచ్చాను.' అని ఆయన చెప్పాడు.
చంద్రబాబు సెంటిమెంట్ నంబర్ 23తో వ్యూహాం లింక్
చంద్రబాబుకు, 23 నంబర్‌తో ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నంబర్ లింక్ గురించి తెలుసు. ఇప్పుడీ సెంటిమెంట్‌తో వ్యూహం విడుదలకు లింక్ ఉంది. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాను నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అది కాస్తా మార్చి 23వ తేదీన విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమా ఈనెల 23న రిలీజ్ అవుతున్న సందర్భంగా, మరోసారి చంద్రబాబు చుట్టూ అల్లుకున్న '23 సెంటిమెంట్'ను నెటిజన్లు బయటకు తీశారు.. ఈ విషయంలో ఆర్జీవీ కూడా ఒక ట్వీటేశారు. గతంలో వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న 23 ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి, ఎన్నికల్లో బాబుకు 23 సీట్లు మాత్రమే వచ్చిన అంశం వరకు, చివరికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయిన తేదీని కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ర్యాగింగ్‌కు దిగాడు ఆర్జీవీ.
వాళ్లు వ్యూహం తప్పకుండా వ్యూహం చూస్తారు
వ్యూహం సినిమాను టీడీపీ-జనసేన జనాలు ఎవ్వరికీ తెలియకుండా వాళ్ల బాత్రూమ్స్‌లలో చూసుకుంటారనేది తన ఉద్దేశం అంటూ చెప్పాడు. పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు మాత్రం ఆ అవసరం ఉండదన్నాడు. వాళ్లు హ్యాపీగా థియేటర్లకు వచ్చి చూడడం లేదా తమ ఇంట్లో లివింగ్ రూమ్‌లో అందరితో కలిసి చూస్తారని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment