
సాక్షి, హైదరాబాద్ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విజయవంతం కావడమే కాక, వైఎస్సార్‌సీపీ తరఫున తాను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నాననే అక్కసుతో చంద్రబాబు కుటుంబీకులు కక్షకట్టి, తనపై లేనిపోనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ నిన్న (గురువారం) ఓ టీవీ చానల్ ప్రసారం చేసిన చర్చలో.. గతంలో తన అభిమానిగా ఉన్న కోటి అనే వ్యక్తిని బెదిరించి, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయించారని వాపోయారు. ఇటువంటి చర్యలు చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment