లక్ష్మీస్ ఎన్టీఆర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ బయోపిక్ ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో తనదైన స్టైల్‌లో వివాదాలకు తెరతీశాడు వర్మ.
ఈ సినిమాలో ఏ ఏ పాత్రలు కనిపించబోతున్నాయో కూడా వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌లో కనిపించనున్నారు. కేసీఆర్ తనయుడు తారకరామారావు (కేటీఆర్), కూతురు కవిత, హరీష్ రావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని ప్రకటించాడు వర్మ.
On the eve of Andhra Pradesh Chief Minister @ncbn ‘s birthday , I am releasing this first look of Telangana Chief Minister KCR ‘s biopic #TIGERKCR pic.twitter.com/0uvX5f49KT
— Ram Gopal Varma (@RGVzoomin) 20 April 2019
Comments
Please login to add a commentAdd a comment