భీమవరంలో పవన్‌పై పోటీ చేస్తా : ఆర్జీవీ | Ram Gopal Varma Announces To Contest Opposite Pawan Kalyan From Bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో పవన్‌పై పోటీ చేస్తా : ఆర్జీవీ

Published Thu, Mar 28 2019 11:47 AM | Last Updated on Thu, Mar 28 2019 12:53 PM

Ram Gopal Varma Announces To Contest Opposite Pawan Kalyan From Bhimavaram - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. ప్రస్తుతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో రోజు వార్తల్లో కనిపిస్తున్న వర్మ తాజాగా ఎన్నికల బరిలో దిగుతున్నడుగా ట్వీట్ చేశాడు. అది కూడా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటిచేస్తున్న భీమవరం నుంచేనట. గతంలో పవన్‌ను టార్గెట్‌ చేస్తూ చాలా ట్వీట్లు చేశాడు. పవన్‌ తన అభిమాన నటుడు అంటూనే విమర్శలు గుప్పించిన వర్మ కొంత కాలంగా ట్వీటర్‌లో మెగా ఫ్యామిలీ మీద కామెంట్స్ చేయటం మానేశాడు.

తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ్‌కు మరో 24 గంటలు మాత్రమే ఉన్న సమయంలో ఇలాంటి సంచల ట్వీట్‌తో మరో సారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసినా తనకు పై స్థాయి నుంచి పోటి చేసేందుకు పర్మిషన్‌ వచ్చిందని, పూర్తి వివరాల కోసం వేచి ఉం‍డాలంటూ ట్వీట్ చేశాడు వర్మ. 12 గంటల తరువాత చేసిన మరో ట్వీట్‌లో ఇది అడ్వాన్స్‌ ఏప్రిల్ ఫూల్‌ జోక్‌ అని తేల్చేశాడు. అంతేకాదు ఈ జోక్‌ను నమ్మేంత తెలివి తక్కువ వారు ఎవరూ ఉండరనే అనుకుంటున్నా అని కామెంట్ చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement