ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా వర్మ..! | Ram Gopal Varma Latest Update On Lakshmis Ntr | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 12:46 PM | Last Updated on Fri, Jan 18 2019 12:46 PM

Ram Gopal Varma Latest Update On Lakshmis Ntr - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ప్రకటన దగ్గర నుంచి ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ఒక్క అప్‌డేట్‌తో మరిన్ని వివాదాలకు తెరతీస్తూ వస్తోంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబంధించి మరో అప్‌డేట్‌ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు.

రామ్‌ గోపాల్‌ వర్మ స‍్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో యాగ్న శెట్టి నటిస్తున్నారు. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోయే నటుడినే వర్మ ఈ రోజు ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. వర్మ  ఈరోజు ఎలాంటి వివాదాలకు తెరలేపుతాడో తెలియాలంటే ఐదు గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement