
వివాదాలకు కేరాఫ్.. సంచలనాలకు తెరలేపే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అలాంటి ఆర్జీవీ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాటను వదులుతూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరో అప్‌డేట్‌ను ఆర్జీవీ ప్రకటించేశాడు.
ఎన్టీఆర్ వర్ధంతి నాడు ప్రకటించిన ఈ ప్రోమోలో ఎన్టీఆర్ పాత్రను రివీల్‌చేశాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న ఎన్టీఆర్ లుక్‌ను తనదైన శైలిలో ఆర్జీవీ విడుదల చేశారు. వెన్నుపోటు పొడిచిన తరువాత ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో సజీవంగా తిరిగి వస్తున్నారు అంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ లుక్‌ను రిలీజ్ చేశాడు.
After he was killed by backstabbing NTR comes back once again alive in Lakshmi’s NTR https://t.co/TX6APEeo9Q
— Ram Gopal Varma (@RGVzoomin) 18 January 2019