రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మది ప్రత్యేకమైన శైలి. లేటెస్ట్ రిలీజ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో మరోసారి ఆ విషయాన్ని నిరూపించారు. ఈ జానర్‌లో ఇది వరకు ‘రక్త చరిత్ర, వంగవీటి, 26/11 ఎటాక్స్’ తెరకెక్కించారు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడెప్పుడో వర్మ ప్రకటించిన శశికళ బయోపిక్ త్వరలోనే వస్తుందని తెలిపారు.
దయలేని మగవాళ్లు, జైళ్లు, మన్నారగుడి గ్యాంగ్స్ వీటన్నింటినీ ఎదురించి నిలబడ్డ అనుబంధమే ఈ ‘శశికళ’ చిత్రం. టైటిల్‌కు ‘ప్రేమ.. భయంకరమైన రాజకీయం’ అనే ట్యాగ్‌లైన్ కూడా యాడ్ చేశారు వర్మ. మరి ఈ బయోపిక్‌తో తమిళ పాలిటిక్స్‌లో కూడా వర్మ ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తారో వేచి చూడాలి.
ప్రేమ.. భయంకరమైన రాజకీయం
Published Mon, Apr 1 2019 12:12 AM | Last Updated on Mon, Apr 1 2019 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment