కొద్ది రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్ అయిన వీడియో క్లిప్‌పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.‘ఈ వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో ఎవరైనా నాకుసాయం చేస్తారా.? అతన్ని నాకు టచ్‌లోకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ అందిస్తా.’ అంటూ వర్మ ఆ వీడియోను తన ట్విటర్‌పేజ్ లో పోస్ట్ చేశాడు. చాలా రోజులు క్రితం వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అక్టోబర్19 నుంచి ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.