రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సినిమా చూసిన తరువాత విడుదలపై తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం గతంలోనే వెల్లడించింది. అయితే రిలీజ్ పై స్టే విధించటాన్ని చిత్రయూనిట్ సుప్రీం కోర్టులో చాలెంజ్ చేసింది. దీంతో విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కారణంగా తాము తీర్పు చెప్పలేమని, సినిమా ప్రివ్యూ కూడా చూడలేమని హైకోర్టు న్యాయమూర్తులు కేసును ఏప్రిల్ 9కి వాయిదా వేశారు.
ఈ రోజు రిలీజ్ విషయంలో నిర్ణయం వెలువడుతుందని నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కేసు వాయిదా వేయటంతో రిలీజ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సినిమా విడుదల కాకపోవటంతో తమకు నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్ల హైకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment