‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చూసిన ఉండవల్లి | Undavalli Aruna Kumar Saw The Lakshmis Ntr Film With Sira sri | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా చూసిన ఉండవల్లి

Published Sat, Mar 30 2019 11:09 AM | Last Updated on Sat, Mar 30 2019 11:10 AM

Undavalli Aruna Kumar Saw The Lakshmis Ntr Film With Sira sri - Sakshi

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్‌ కాకుండా అడ్డుకోగలిగారు కానీ, సినిమా చూడలనుకున్న ప్రేక్షకులను మాత్రం ఆపలేకపోయారు. సినిమా చూసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి అభిమానులు తెలంగాణకు తరలివస్తున్నారు. వీరిలో ప్రముఖులు కూడా ఉండటం విశేషం. రాజమండ్రిలో సినిమా రిలీజ్‌ కాకపోవటంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కూడా హైదరాబాద్‌లో సినిమా చూశారు.
(చదవండి : బాహుబలి 2, అర్జున్‌ రెడ్డిలను వెనక్కి నెట్టిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’)

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్‌ కుమార్‌లతో కలిసి అరుణ్‌ కుమార్‌ సినిమా చేశారు. ఈ విషయాన్ని సిరాశ్రీ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైకోర్టు స్టే విధించటంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల కాలేదు.
(చదవండి : ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement