sira sri
-
రాముడిని కాదు రావణాసురుడిని: వర్మ వెరైటీ రిప్లై
సాధారణంగా బర్త్‌డేను అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆయన మాత్రం జీవితంలో ఒక ఏడాది ముగిసిపోయిందని, కాబట్టి ఇది బర్త్‌డే కాదు, డెత్ డే అంటూ విచిత్రంగా మాట్లాడుతుంటాడు. ఆయనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. నేడు(ఏప్రిల్ 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి ఇష్టమున్నా లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ గేయ రచయిత సిరాశ్రీ ఆర్జీవీని పొగడ్తలతో ముంచెత్తాడు. సైకిల్ చైనుతో సినిమా సైకీనే మార్చివేసి చరితాత్ముండై జైకొట్టిన ఛీకొట్టిన రాకెట్టుగ దూసుకెళ్లు రాముండితడే అని ఓ పద్యం రాసుకొచ్చాడు. ఇది చూసిన వర్మ అంతా బానే ఉంది కానీ తనను రాముడితో కాకుండా రావణాసురుడితో పోలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అయితే మాటల గారడీ చేసే సిరాశ్రీ.. పద్యాలతో మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కన్నా వినోదం ఇంకేముంటుందంటూ మరో పద్యాన్ని సైతం రాసుకొచ్చాడు. ఆర్జీవీ పద్ధతిలో దర్జాగా బ్రతుకువారు తరచిన లేరే! ఆర్జించిన జ్ఞానమునే గర్జించును సింహమట్లు కడు నేర్పరిగా! అని రాసుకొచ్చాడు. ఇది చూసిన వర్మ మీరు అనుకుంది సాధించారంటూ కామెంట్ చేయడం విశేషం. All well but I will be more comfortable in comparison with Ravana https://t.co/KgwFVxjlbF — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022 Well sirrrr u achieved ur purpose https://t.co/GkWrbcgoke — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022 చదవండి: తమిళనాడులో కూడా విజయ్ 'బీస్ట్'కు చుక్కెదురు! -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ఉండవల్లి
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ కాకుండా అడ్డుకోగలిగారు కానీ, సినిమా చూడలనుకున్న ప్రేక్షకులను మాత్రం ఆపలేకపోయారు. సినిమా చూసేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి అభిమానులు తెలంగాణకు తరలివస్తున్నారు. వీరిలో ప్రముఖులు కూడా ఉండటం విశేషం. రాజమండ్రిలో సినిమా రిలీజ్ కాకపోవటంతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైదరాబాద్‌లో సినిమా చూశారు. (చదవండి : బాహుబలి 2, అర్జున్ రెడ్డిలను వెనక్కి నెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’) లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి అరుణ్ కుమార్ సినిమా చేశారు. ఈ విషయాన్ని సిరాశ్రీ తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైకోర్టు స్టే విధించటంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) రాజమండ్రిలో రిలీజ్ అవ్వలేదని హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమా చూసిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిత్రంలో ఎమెస్కో అధినేత శ్రీ విజయకుమార్. #LakshmisNTR pic.twitter.com/GjcWoGbpIU — sirasri (@sirasri) 30 March 2019 -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. బాబుకు మరో ఝలక్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే తనదైన స్టైల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. తొలి పాటలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతీల మధ్య ప్రేమాను రాగాలను చూపించిన వర్మ రెండో పాటలో ఎన్టీఆర్ పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించిందన్న విషయాలను టార్గెట్ చేశాడు. (చదవండి : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుంచి ప్రణయ గీతం) అవసరం అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్‌గా చూపించాడు. వెన్నుపోటు పొడిచిన బాబు, ఎన్టీఆర్ పోయాక దండవేసి దండం పెడుతున్నాడని చురకలంటించాడు. కల్యాణ్ మాళిక్ సంగీత సారధ్యంలో విల్సన్ హెరాల్డ్ ఆలపించిన ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించారు. ఈ పాటతో పాటు రేపు (మార్చి 8) సినిమాకు సంబంధించి రెండో థియేట్రికల్ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. (చదవండి : భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ) -
ఆఫీసర్ ‘నవ్వే నువ్వు నవ్వకపోతే’ తొలి పాట విడుదల
-
నా కెరీర్లోనే ఫస్ట్ టైమ్...: వర్మ
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అక్కినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్లో రిలీజ్ చేశారు. తన కెరీర్లోనే తొలిసారిగా ఓ చిన్నపాపపై తాను పాటను రూపొందించానని ఆయన చెబుతున్నారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే.. అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్ చెప్పగా, తనదైన స్టైల్లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ చిత్రానికి రవి శంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగార్జున, మైరా సరీన్, అజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఆఫీసర్ జూన్ 1న విడుదల కానుంది. -
డ్రగ్స్ కేసుపై వర్మ స్పందన
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఫిలిం స్టార్స్ ప్రమోయం పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ ముగిసిన తరువాత ఆయనకు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ఆయనకు బహిరంగంగానే మద్ధతు తెలపగా.. తాజాగా పూరి గురువు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. 'సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం.' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ కామెంట్స్ తో పాటు ప్రముఖ రచయిత సిరాశ్రీ సినిమాలపై రాసిన ఓ కవితను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే వాళ్లు విమర్శించడానికి వాళ్లు వేసే నిందలు బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ సిరాశ్రీ రెండు రోజుల క్రితం తన ఫేస్ బుక్ లో ఓ కవితను పోస్ట్ చేశాడు. ఇప్పుడు అదే కవితను వర్మ మళ్లీ పోస్ట్ చేశాడు.