డ్రగ్స్ కేసుపై వర్మ స్పందన
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఫిలిం స్టార్స్ ప్రమోయం పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణ ముగిసిన తరువాత ఆయనకు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ఆయనకు బహిరంగంగానే మద్ధతు తెలపగా.. తాజాగా పూరి గురువు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు.
'సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం.' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు.
ఈ కామెంట్స్ తో పాటు ప్రముఖ రచయిత సిరాశ్రీ సినిమాలపై రాసిన ఓ కవితను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే వాళ్లు విమర్శించడానికి వాళ్లు వేసే నిందలు బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ సిరాశ్రీ రెండు రోజుల క్రితం తన ఫేస్ బుక్ లో ఓ కవితను పోస్ట్ చేశాడు. ఇప్పుడు అదే కవితను వర్మ మళ్లీ పోస్ట్ చేశాడు.