‘వెన్ను పోటు’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేయనున్న వర్మ..! | The first look of Vennu Potu Song from Lakshmis NTR Details | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 1:09 PM | Last Updated on Wed, Dec 19 2018 3:29 PM

The first look of Vennu Potu Song from Lakshmis NTR Details - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాల సంగతి ఎలా ఉన్నా ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఇటీవల దర్శకుడిగా వరుసగా ఫెయిల్‌ అవుతున్న ఆర్జీవీ తాజాగా భైరవ గీతతో నిర్మాతగా పరవాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో వెన్నుపోటు పాటకు ప్రత్యేకంగా ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ. అయితే వర్మ రిలీజ్ చేయబోయే పాటే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పాట కోసం రిలీజ్ చేస్తున్న పోస్టర్‌ను ఏ రేంజ్‌లో డిజైన్‌ చేశాడా అన్న ఆసక్తి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement