
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని, వినని తెలుగు వారుండరు. అంతగా తన సినిమాలతో, మాటలతో, వివాదాలతో ముద్ర వేశాడీ దర్శకుడు. గత కొన్నేళ్లుగా తన స్థాయిలో ఓ సినిమాను తీయాలని అభిమానులు ఆశిస్తుండగా.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఆర్జీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.
ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేస్తానని ప్రకటించాడు ఆర్జీవీ. ట్రైలర్ విషయంలో స్వర్గం నుంచి ఎన్టీఆర్ తనను తిట్టాడనీ, రేపు (మార్చి 8) ఉదయం 9.27 గంటలకు ప్రీపోన్ చేయాలని అన్నారని ట్వీట్ చేశాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ.. రెండో ట్రైలర్‌తో ఇంకెంత వేడిని పెంచేస్తుందో చూడాలి.
NTR from heaven scolded me and asked me to prepone the release of #LakshmisNTR Theatrical Trailer to 9.27 Am tmrw 8 th morning 🔪 pic.twitter.com/eWdhJrNTR1
— Ram Gopal Varma (@RGVzoomin) March 7, 2019