తాను తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు అమితాసక్తి కనబరుస్తున్నారని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. చంద్రబాబు గురించి మనం గొంతు చించుకుని చెప్పక్కర్లేదని ఈ సినిమా చూపిస్తే చాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో వర్మ తనదైన శైలిలో స్పందించారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ)
‘చిత్తూరులో ఉన్నోళ్లు చైన్నైకి, అనంతపురం, కడపలో ఉన్నోళ్లు బెంగళూరుకి, కర్నూలులో ఉన్నోళ్లు పక్కనే ఉన్న కర్ణాటకకు, విజయవాడలో ఉన్నోళ్లు సూర్యాపేటకు, ఉత్తరాంధ్రలో ఉన్నోళ్లు ఒడిశాకు వెళ్లి లక్షీస్ ఎన్టీఆర్ సినిమా చూడాలనే బలీయమైన కోర్కెను వెలిబుచ్చుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఫ్యాన్స్ కాకుండా, తటస్థ ఓటర్లకు ఈ సినిమా చూపించే బాధ్యత పార్టీ తీసుకుని ఏర్పాటు చేయాలని నా మనవి. ప్రచారానికి పెట్టే ఖర్చులో పదోవంతు పెడితే చాలు.. చంద్రబాబు గురించి మనం గొంతు చించుకుని చెప్పక్కర్లేద’ని రాంగోపాల్ వర్మ ట్విటర్‌లో రాసుకొచ్చారు. సినిమా ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు అంటూ కథానాయకుడు సినిమాలో ఎన్‌టీఆర్ పాత్రలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఉన్న వీడియోను కూడా ట్విటర్‌లో షేర్ చేశారు.
సినిమా ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీ కి లేదు.. - ఎన్. టీ. ఆర్@RGVzoomin #NTR #LakshmisNTR #LakshmisNTRonMarch29 pic.twitter.com/GUovjtttg7
— Telugu Cinema (@TeluguCinema) 28 March 2019
ప్రప్రధమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కింది. కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హతవిధి!!!
— Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019
తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ రేపు తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో ?. 😡😡😡😡😡 pic.twitter.com/AryuViAEHQ
— Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019
సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలంలో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు pic.twitter.com/9iImMjv5OL
— Ram Gopal Varma (@RGVzoomin) 28 March 2019
Comments
Please login to add a commentAdd a comment