‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి ప్రణయ గీతం | Ram Gopal Varma Lakshmis NTR First Video Song Nee Uniki | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుంచి ప్రణయ గీతం

Published Sun, Feb 24 2019 9:46 AM | Last Updated on Sun, Feb 24 2019 4:02 PM

Ram Gopal Varma Lakshmis NTR First Video Song Nee Uniki - Sakshi

ఎన్టీఆర్‌ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకున్న వర్మ, తాజాగా ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు.

ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల మధ్య ఉన్న ప్రేమానురాగాల నేపథ్యంలో తెరకెక్కించిన ప్రణయ గీతం వీడియోను రిలీజ్‌ చేశాడు. ‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అంటూ సాగే ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించగా లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కల్యాణీ మాలిక్‌ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 15న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement