ఐఐటీ కౌన్సెలింగ్‌పై సుప్రీం స్టే!
న్యూఢిల్లీ: ఐఐటీ–జేఈఈ 2017 (అడ్వాన్స్‌డ్) ఫలితాల ఆధా రంగా నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వెంటనే ఆపాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ ఈ ఆదే శాలు అమల్లో ఉంటాయంది. కౌన్సెలింగ్, ప్రవేశాలకు సంబంధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించరాదని హైకోర్టులకు సూచించింది.
ఐఐటీ–జేఈఈ 2017 ర్యాం కుల జాబితా, అభ్యర్థులందరికీ అదనపు మార్కులు కేటాయించడాన్ని సవాలు చేస్తూ వివిధ హైకోర్టుల్లో ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయో చెప్పాలని ఆయా రిజిస్ట్రీలను ఆదేశిస్తూ విచారణ ను సోమవారానికి వాయిదా వేసింది. ఎందరో విద్యార్థులు పరీక్షలు రాశారని, వారందరినీ దృష్టిలో పెట్టుకుని సమస్యకు సరైన పరిష్కారం చూపాలని అడ్వొకేట్ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. పిటిష నర్ల న్యాయవాది వికాస్æ వాదిస్తూ.. ‘బోన స్ మార్కులు కేటాయించడం విద్యార్థుల హక్కులను హరించడమే’అన్నారు. స్పందించిన కోర్టు... సదరు ప్రశ్నలకు జవాబులు రాసిన వారికి ‘బోనస్ మార్కులు’ కేటాయించడమొక్కటే దీనికి పరిష్కార మంటూ 2005 నాటి ఓ తీర్పును ప్రస్తావించింది.