- జీఓను సస్పెండ్ చేసిన హైకోర్టు
- కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు
జెడ్పీటీసీ సభ్యుడి సస్పెన్షన్ నిలిపివేత
Published Wed, Aug 17 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
హన్మకొండ/ గూడూరు : గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు మహ్మద్ ఖాసీంను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జోఓను నిలిపివేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అటవీ భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ 532, తేదీ 04.08.2016తో ఖాసీంను సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే, తనను అకారణంగా సస్పెండ్ చేశారని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఖాసీం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఖాసీం పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీఓను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అలాగే, కౌంటర్ దాఖలు చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది.
Advertisement
Advertisement