స్పెషల్ డీఎస్సీపై హైకోర్టు స్టే
Published Sat, Sep 3 2016 11:13 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM
మారేడుమిల్లి :
స్పెషల్ డీఎస్సీ 2016లో ఏపీ టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనరల్ డీఎస్సీ మాదిరిగా వెయిటేజ్ మార్కలు కలపాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషనుకు హైకోర్టు స్టే ఇచ్చినట్టు ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లె ల్లం శేఖర్ తెలిపారు. స్థానిక చెలకవీధిలో శనివారం జరిగిన సంఘం సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గత నెల 28వ తేదీన రంపచోడవరం, 29వ తేదీన చింతూరు గ్రామంలో జరగాల్సిన డీఎస్సీ 2016 ఉపాధ్యాయుల నియామకాల పరీక్షలకు జీఓ నెం 2922/2016 ప్రకారం స్పెషల్ డీఏస్సీలో టేట్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనే అంశంపై గిరిజనులు సింహచలం, దుర్బాంబ, మాధవి, విజయ భాస్కర్ రెడ్డి, అన్నం నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చి తాత్కాలికంగా వాయిదా వేశారని తెలిపారు. టేట్ ఆదివాసీ అభ్యర్థులు ఆదివారం రంపచోడవరంలోని స్వర్ణ భారతి గ్రౌండ్‌లో జరిగే సమావేశంలో తమ పేర్లు న మోదు చేసుకోవాలని సూచించారు. సంఘం నాయకులు అందాల రత్నారెడ్డి, కత్తుల ఆదిరెడ్డి, పల్లాల రాజశేఖర్ రెడ్డి, రంభ తదితరులు
పాల్గొన్నారు.
Advertisement