special dsc
-
మైనారిటీ డిక్లరేషన్ అమలేది?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ‘మైనారిటీ డిక్లరేషన్’ఎప్పుడు అమలు చేస్తారని మైనారిటీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మైనారిటీల సంక్షేమం, అభివద్ధికి ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు చేస్తుందని ప్రకటించింది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీడబ్యుసీ సభ్యులు నాసీర్, షకీల్ అహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలిసి హైదరాబాద్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మైనారిటీలపై హమీల వర్షం గుప్పించారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా 11 నెలలు దాటినా.. ఏ ఒక్కటి కూడా ఊసెత్తక పోవడంతో మైనారిటీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ⇒ మైనారిటీ సంక్షేమ బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంచుతామని ప్రకటించినా.. మొదటి ఏడాది 2024–25లో కేవలం రూ. 3,003 కోట్లకు పరిమితమైంది. ⇒ నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని డిక్లరేషన్‌లో వెల్లడించినా మొత్తం బడ్జెట్లోనే వాటా కేవలం రూ.432 కోట్లకు పరిమితమైంది. ⇒ అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు అందించాల్సిన ఆర్థికసాయం కాగితాలకు పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఉర్దూ డీఎస్సీ ప్రకటించండి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ హమీ మేరకు ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–2024లో ఉర్దూ మీడియానికి మొత్తం 1,183 పోస్టులు కేటాయించినా, ఎస్సీ, ఎస్టీ ఇతరత్రా రిజర్వేషన్ కేటగిరి కారణంగా అర్హులైన అభ్యర్ధుల లేక సుమారు 666 పోస్టులు భర్తీకి నోచుకోలేదని విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఎప్పటి మాదిరిగానే ఈసారి డీఎస్సీలో కూడా ఉర్దూ మీడియం రిక్రూట్మెంట్లో సగానికి పైగా పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోయాయి. ప్రభుత్వం డీఎస్సీలు నిర్వహిస్తున్నా, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఖాళీల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వ్యక్తవుతున్నాయి. దీంతో ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని డీ–రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీ కింద చేర్చి, ఖాళీలతో కలిపి స్పెషల్ డీఎస్సీ తక్షణమే ప్రకటించాలంటున్నారు. మరోవైపు డీఎస్సీ–2024 మెరిట్ అభ్యర్ధులు మాత్రం రెండవ జాబితా ప్రకటించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు రవీంద్రభారతిలో అవార్డుల అందజేత భారతరత్న, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబు ల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఉర్దూ అకాడమీ, టెమ్రీస్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరగనున్న మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ నేషనల్ అవార్డు 2019– 2023, మగ్దూమ్ అవార్డు–2024, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2021–23 లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాల్గొంటారు. పెండింగ్‌లో గౌరవ వేతనాలు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా మసీదుల ఇమామ్, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చిల పాస్టర్ల గౌరవ వేతనాల పెంపు సంగతేమోగానీ ...వేతనాల పెండెన్సీ పెరిగిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని ఇమామ్, మౌజమ్‌లు డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వా«దీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామన్న హాదమీ కనీసం ప్రణాళికలను కూడా నోచుకోలేదు. -
మార్కులు రాకపోయినా ఉద్యోగం!
అనంతపురం విద్య: ఐఈడీఎస్‌ఎస్ (ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఆఫ్ సెకండరీ స్టేజ్)– ప్రత్యేక డీఎస్సీ–2019ని తొలిసారిగా విడుదల చేశారు. రాత పరీక్ష నిర్వహించి 2019 నవంబర్‌లో ఫలితాలు విడుదల చేశారు. 100 మార్కుల రాత పరీక్షలో ఓపెన్ కేటగిరీ వారికి 60 మార్కులు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 40 మార్కులు కట్ ఆఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 55 పోస్టులకు 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 జూన్ 30న రాత పరీక్ష నిర్వహించి 45 పోస్టులను భర్తీ చేశారు. అర్హత మార్కులు రాకపోయినా ఉద్యోగాలు ఓసీ కేటగిరీకి మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. అర్హతగా నిర్ణయించిన 60 మార్కులు వచ్చిన వారు కేవలం 6గురే ఉన్నారు. తక్కిన 20 పోస్టులు ఓపెన్ కేటగిరి పోస్టుల్లో అర్హులు లేకపోతే వచ్చే డీఎస్సీలో భర్తీ చేయాలి. కానీ అధికారులు మాత్రం అర్హత మార్కులు తక్కువగా వచ్చినప్పటికీ మొత్తం 26 పోస్టులను భర్తీ చేశారు. ఇతర కేటగిరీ వారికి ఓపెన్ కేటగిరీ వారీగా పరిగణించి నియామకాలు చేసేశారు. అంతా ఇష్టానుసారం ♦నవంబర్, 2019లో తొలుత ప్రకటించిన ఫలితాల్లో ‘టెట్’లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నారు. వెయిటేజీతో కలిపి డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. ♦తాజాగా ‘టెట్’ మార్కులు తొలగించి డీఎస్సీ మార్కులను ప్రామాణికంగా తీసుకున్నారు. ♦సమగ్రశిక్ష సహిత విభాగం కింద పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు స్పెషల్ డీఎస్సీలో 5 మార్కులు వెయిటేజీ ప్రకటించారు. అయితే డీఎస్సీలో అర్హత మార్కులు వచ్చినప్పుడే వెయిటేజీ మార్కులు కలపాలి. ♦డీఎస్సీలో అర్హత మార్కులు రాకున్నప్పటికీ వెయిటేజీ మార్కులు కలిపి 5గురు అభ్యర్థులకు పోస్టింగ్ కల్పించారు. దీంతో రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఐదుగురికి ఉద్యోగాలు దక్కని పరిస్థితి నెలకొంది. ♦ఏ కేటగిరీలో మిగిలిపోయిన పోస్టులను ఆ కేటగిరీ వారితోనే భర్తీ చేయాలి. సదరు కేటగిరీలో అర్హులు లేకపోతే.. వచ్చే డీఎస్సీలో అదే కేటగిరీలో బ్యాక్లాగ్ పోస్టుల కింద భర్తీ చేయాలి. ♦ నిర్దేశించిన అర్హత మార్కులను నోటిఫికేషన్లో పేర్కొనకుండా రాత పరీక్ష నిర్వహించి ఉంటే డీఎస్సీలో ఒక మార్కు వచ్చినా.. 5 మార్కుల వెయిటేజీ కల్పించవచ్చు. కానీ డీఎస్సీ నోటిఫికేషన్లో కేటగిరి వారీగా అర్హత మార్కులు పేర్కొన్నారు. ♦అయినా నియామకాల్లో ఇష్టానురీతిగా నిబంధనలు విస్మరించి వెయిటేజీ కల్పించి అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్లో నిబంధనలకు నీళ్లొదిలారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు పాతర వేశారు. రోస్టర్ పాయింట్లు పక్కన పెట్టేశారు. ఒక కేటగిరి వారిని మరో కేటగిరీలో కలిపారు. మెరిట్ టు మెరిట్‌ను పూర్తిగా విస్మరించి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. వెరసి స్పెషల్ డీఎస్సీ నియామకాలన్నీ గందరగోళంగా సాగాయి. ఉన్నతాధికారుల అడ్డగోలు నిర్ణయాలతో 25 మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తా రోస్టర్ పాయింట్ల నిర్ధారణ, అభ్యర్థుల ఎంపిక మా పరిధిలో లేని అంశం. తప్పిదాలు జరిగి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. అర్హులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం. – కె.శామ్యూల్, డీఈఓ, అనంతపురం -
ప్రశాంతంగా మొదటి రోజు స్పెషల్ డీఎస్సీ
రంపచోడవరం : రెండు రోజులపాటు జరిగే ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ–2016 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లెనోరా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు సందర్శించారు. పరీక్షలకు 1136 మందికిగానూ 1104 మంది హాజరైనట్టు డీడీ సరస్వతి తెలిపారు. -
స్పెషల్ డీఎస్సీపై హైకోర్టు స్టే
మారేడుమిల్లి : స్పెషల్ డీఎస్సీ 2016లో ఏపీ టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జనరల్ డీఎస్సీ మాదిరిగా వెయిటేజ్ మార్కలు కలపాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషనుకు హైకోర్టు స్టే ఇచ్చినట్టు ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లె ల్లం శేఖర్ తెలిపారు. స్థానిక చెలకవీధిలో శనివారం జరిగిన సంఘం సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గత నెల 28వ తేదీన రంపచోడవరం, 29వ తేదీన చింతూరు గ్రామంలో జరగాల్సిన డీఎస్సీ 2016 ఉపాధ్యాయుల నియామకాల పరీక్షలకు జీఓ నెం 2922/2016 ప్రకారం స్పెషల్ డీఏస్సీలో టేట్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలనే అంశంపై గిరిజనులు సింహచలం, దుర్బాంబ, మాధవి, విజయ భాస్కర్ రెడ్డి, అన్నం నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చి తాత్కాలికంగా వాయిదా వేశారని తెలిపారు. టేట్ ఆదివాసీ అభ్యర్థులు ఆదివారం రంపచోడవరంలోని స్వర్ణ భారతి గ్రౌండ్లో జరిగే సమావేశంలో తమ పేర్లు న మోదు చేసుకోవాలని సూచించారు. సంఘం నాయకులు అందాల రత్నారెడ్డి, కత్తుల ఆదిరెడ్డి, పల్లాల రాజశేఖర్ రెడ్డి, రంభ తదితరులు పాల్గొన్నారు.