సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులతో పాటు ఇతర క్రిమినల్, సివిల్ కేసుల్లో విచారణ పెండింగ్‌లో ఉండగా, వాటిపై ఏవైనా స్టే ఉత్తర్వు లు ఇచ్చిఉంటే, ఆ స్టే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దయిపోతాయంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని హైకోర్టు బుధవారం ఉభయ రాష్ట్రాల్లోని అన్ని కింది కోర్టులను ఆదేశించింది. జిల్లాల పరిధిలో ఈ తీర్పు అమలయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జీలందరికీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్‌తో పాటు సుప్రీంకోర్టు తీర్పును కూడా పంపింది.
ఈ యాక్ట్ కింద నమోదైన కేసులపై స్టే విధిస్తూ ఇప్పటికే ఏవైనా ఉత్తర్వులు జారీచేసి ఉంటే, ఆ ఉత్తర్వులు ఆరు నెలల తరువాత ఆటోమేటిగ్గా రద్దయిపోతాయంటూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ స్టేని పొడిగించాలంటే, అందుకు తగిన కారణాలను తెలియచేయాలని అటు హైకోర్టులు, ఇటు కింది కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల గడువు ముగిసిన తరువాత ఈ కేసుల్లో ప్రొసీడింగ్స్‌ను కొనసాగిం చాలని కింది కోర్టులను ఆదేశించింది. ఈ తీర్పు అమలయ్యేలా చూసేందుకు కింది కోర్టులకు తగిన సూచనలు చేయాలని హైకోర్టులకు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment