orders pass
-
పంజాబ్‌కు కొత్త డీజీపీ
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు రాష్ట్రంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రాను పంజాబ్ కొత్త డీజీపీగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులొచ్చాయి. కొంతకాలంగా భవ్రా పంజాబ్ హోంగార్డ్స్ డీజీపీగా కొనసాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్ నుంచి భవ్రాను చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఎంపికచేసింది. దీంతో భవ్రాను డీజీపీగా పంజాబ్ గవర్నర్ నియమించారు. బాధ్యతలు చేపట్టాక భవ్రా కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. గత మూడు నెలలకాలంలో పంజాబ్‌కు కొత్త డీజీపీ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ పంపిన షార్ట్‌లిస్ట్‌లోని ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంచుకోవాలి. కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దిన్కర్ గుప్తా డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. అమరీందర్ తప్పు కున్నాక చన్నీ సీఎం అయ్యారు. గత సెప్టెంబర్‌లో 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాను డీజీపీగా చన్నీ ఎంచుకున్నారు. అయితే సహోతా నియామకాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధూ ఒత్తిడికి తలొగ్గిన చన్నీ సర్కార్.. సహోతాను తప్పించింది. రెగ్యులర్ డీజీపీ నియామకం జరిగే లోపు బాధ్యతలు నిర్వహించేందుకు 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయను చన్నీ ప్రభుత్వం డీజీపీ పీఠంపై కూర్చోబెట్టింది. -
ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!
నంగర్హర్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అక్కడ రోజుకో ఆంక్ష అన్నట్లే ఉంది. ఇప్పటికే ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం.. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లకు పలు ఆంక్షలు విధించింది. ట్యాక్సీల్లో ముష్కరులను ఎవరినైనా తీసుకొస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్లను తాలిబాన్ అనుబంధ సంస్థలకు సంబంధించిన వారిని మినహాయించి ఇతర ముష్కరులను ఎవ్వరిని మీరు ట్యాక్సిల్లో ఎక్కించుకోని తీసుకురావద్దని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) ఆ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ల అందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్మెన్లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తాలిబన్లు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్సులలో మోహరిస్తున్న ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇలాంటి ఆదేశాలు జారిచేసిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) -
ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!
ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్లాంట్లలో తయారవుతున్న బేవరేజెస్‌ని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. ఇకపై వాటిని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఫుడ్ సేఫ్టీ కి ఫిర్యాదులు మార్కెట్లో సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో నిజానికి డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు. కానీ మార్కెటింగ్ చేసేప్పుడు మాత్రం మిల్క్ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై డెయిరీ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ మిల్క్ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్ అమ్ముతున్న ఆయా కంపెనీలపై కన్నెర్ర చేసింది. 15 రోజుల్లోగా మార్చేయండి మిల్క్ ప్రొడక్టుల పేరుతో మార్కెట్లో బేవరేజ్పై ‘మిల్క్ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే ఆన్లైన్లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు అందాయి. గడువు పెంచండి ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని కానీ ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు అంటున్నాయి. తమకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి. స్పష్టత కావాలి ఫ్యాక్టరీలో తయరయ్యే వస్తువులకు మిల్క్ ప్రొడక్టులు పేర్కొనడం వల్ల తమకు నష్టం వస్తోందని డెయిరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ బేవరేజేస్ మార్కెట్ దేశంలో విస్తరిస్తోందని, ఇప్పుడే ‘ మిల్క్ ప్రొడక్ట్ ’ విషయంలో స్పష్టత తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే అంచనాతో డెయిరీలో కఠినంగా వ్యవహారించాయి. మనదేశంలో మిల్క్ ప్రొడక్టుల పేరుతో అమ్ముడవుతున్న బేవరేజేస్ మార్కెట్ విలువ రూ. 185 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. చదవండి: ‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో! -
టెలికాం కంపెనీలపై ట్రాయ్ కన్నెర్ర! ఇష్టారీతిగా ఆఫర్లు ఇవ్వొద్దంటూ ఆదేశం!!
మొబైల్ ఫోన్ ఆపరేటర్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. తమకు తెలియకుండా కస్టమర్లకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ తేల్చి చెప్పింది. తమ ఆదేశాలు హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ ట్రాయ్ వెల్లడించింది. ఫిర్యాదుల వెల్లువ ఇండియన్ మొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. కొత్త చందాదారులను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం వినియోగదారులను ఆకట్టుకునేలా రకరకాల టారిఫ్‌లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ టారిఫ్‌లు ప్రకటించే ముందు ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదని, ట్రాయ్ అనుమతి తీసుకోకుండానే మొబైల్ ఆపరేటర్లు ప్రత్యేక టారిఫ్‌లు అమలు చేస్తున్నారంటూ ఒక సంస్థపై మరో సంస్థ తరచుగా ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కారణం ఏంటీ మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా కస్టమర్లు తమ నంబర్ మారకుండానే ఆపరేటర్‌ను మార్చుకునే వీలుంది. అయితే ఎంఎన్‌పీ అమలు చేసే సమయంలో ప్రత్యర్థి కంపెనీకి చెందిన చందాదారున్ని ఆకట్టుకునేందుకు ట్రాయ్ దగ్గర అనుమతి తీసుకోని పలు రకాల ఆఫర్లు కస్టమర్లకు ప్రకటిస్తున్నాయి. ఇదే సందర్భంలో తమ దగ్గరి నుంచి కస్టమర్ బయటకు వెళ్లకుండా కూడా అనుమతి లేని ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇదంతా థర్డ్‌పార్టీల ద్వారా జరుగుతోంది. ఇంత కాలం ఈ వ్యవహారం జరుగుతూ వస్తోన్నా .. ఇటీవల మొబైల్ ఆపరేటర్లు ఈ అనధికారిక టారిఫ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాయ్‌ని ఆశ్రయించారు. తక్షణమే అమలు మొబైల్ సర్వీస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ అనధికారిక టారిఫ్‌లను అమలు చేయోద్దంటూ ఆదేశించింది. ఈ టారిఫ్ అమలు చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయంది. చదవండి : హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ -
‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటుకు ట్రంప్ ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికా సైన్యంలో కొత్తగా స్పేస్ ఫోర్స్(అంతరిక్ష దళం)ను ఏర్పాటు చేయాలని ఆ దేశ రక్షణ శాఖ విభాగం పెంటగాన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ‘అమెరికా సైన్యంలో ఆరో విభాగంగా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు కోసం తక్షణం ప్రక్రియ ప్రారంభించాలని రక్షణ శాఖ, పెంటగాన్‌ను ఆదేశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. నేషనల్ స్పేస్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘అమెరికాను కాపాడుకునేందుకు అంతరిక్షంలో మన కార్యకలాపాలు కొనసాగడం ఒక్కటే సరిపోదు. ఆధిపత్యం సాధించాలి’ అని పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసులతో పాటు ఇతర క్రిమినల్, సివిల్ కేసుల్లో విచారణ పెండింగ్‌లో ఉండగా, వాటిపై ఏవైనా స్టే ఉత్తర్వు లు ఇచ్చిఉంటే, ఆ స్టే ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దయిపోతాయంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని హైకోర్టు బుధవారం ఉభయ రాష్ట్రాల్లోని అన్ని కింది కోర్టులను ఆదేశించింది. జిల్లాల పరిధిలో ఈ తీర్పు అమలయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జీలందరికీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్‌తో పాటు సుప్రీంకోర్టు తీర్పును కూడా పంపింది. ఈ యాక్ట్ కింద నమోదైన కేసులపై స్టే విధిస్తూ ఇప్పటికే ఏవైనా ఉత్తర్వులు జారీచేసి ఉంటే, ఆ ఉత్తర్వులు ఆరు నెలల తరువాత ఆటోమేటిగ్గా రద్దయిపోతాయంటూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ స్టేని పొడిగించాలంటే, అందుకు తగిన కారణాలను తెలియచేయాలని అటు హైకోర్టులు, ఇటు కింది కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల గడువు ముగిసిన తరువాత ఈ కేసుల్లో ప్రొసీడింగ్స్‌ను కొనసాగిం చాలని కింది కోర్టులను ఆదేశించింది. ఈ తీర్పు అమలయ్యేలా చూసేందుకు కింది కోర్టులకు తగిన సూచనలు చేయాలని హైకోర్టులకు స్పష్టం చేసింది. -
కార్మికులకు కనీస వేతనం ఖరారు
అనంతపురం అర్బన్: జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికుల రోజువారీ కనీస వేతనం ఖరారు చేస్తూ కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఖరారు చేసిన కనీస వేతనం మహిళ, పురుష కార్మికులకు వర్తిస్తుందని తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. రూరల్ పరిధిలో కార్మికునికి రోజువారీ వేతనం రూ.310 చొప్పున 26 రోజులకు 8,060 ఇవ్వాలి. అర్బన్, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్మికునికి రోజువారీ వేతనం రూ.375 చొప్పున 26 రోజులకు 9,750 ఇవ్వాలి.