కర్నూలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు.
రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే
Jul 19 2016 11:58 PM | Updated on Aug 31 2018 8:31 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
కర్నూలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై హైకోర్టు స్టే మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ‘సాక్షి’కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కట్టడాలను కూల్చివేయడంపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ప్రజా ప్రయోజనాల దష్ట్యా వైఎస్‌ఆర్‌సీపీ తరపున తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఈ మేరకు రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయాలని ఆదేశిస్తూ హైకోర్టు మంగళవారం స్టే మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement