సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లో అనుమతులు లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు గాను కేజ్రీవాల్‌తో పాటు మరో ఆప్ లీడర్ కుమార్ విశ్వాస్‌పై ఎన్నికల సంఘం అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. దీనికి సంబంధించి యూపీలోని సుల్తాన్పూర్ కోర్టు కేజ్రీవాల్, విశ్వాస్‌లకు సమన్లు జారీ చేసింది.
దీనిపై కేజ్రీవాల్, విశ్వాస్‌లు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం దీనిపై విచారణ జరిపిన జగదీష్ సింగ్ ఖేర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్.. సుల్తాన్ పూర్ కోర్టు ఇచ్చిన సమన్లపై స్టే ఇస్తూ నిర్ణయం తీసుకుంది.