
రెండు వారాలకు మించి ఉండలేను
లాస్ ఏంజెల్స్: కుటుంబాన్నివదిలి దూరంగా ఉండటానికి కొంతమంది ఇష్టపడరు. కొందరు ఇంటిమీద బెంగతో హోం సిక్ అవుతారు కూడా. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ హీరోలు సైతం ఇంటిపై బెంగ పెట్టుకుంటారట. హాలీవుడ్ హీరో మాట్ డమోన్ తన కుటుంబాన్ని వదిలి రెండు వారాలకు మించి ఉండలేనని అంటున్నారు. ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో ఎక్కడ షూటింగ్ లో ఉన్నా రెండు వారాలకొకసారి ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. సినిమా ఒప్పుకోగానే తన భార్య లూసియానా బారోస్ తో చర్చిస్తానని చెప్పాడు. రెండు వారాలకు మించి షూటింగ్ కోసం వేరేచోట ఉండాల్సి వస్తే తన భార్య, పిల్లలను తీసుకెళ్తానని తెలిపాడు. ఇది ఒక్కోసారి తమ కుటుంబానికి హాలిడే ట్రిప్ లాగా ఉంటుందని అన్నాడు. గతేడాది చైనా పర్యటనకు ఆరు నెలలు తమ కుటుంబంతో కలిసి వెళ్లినట్టు తెలిపాడు.