గ్రూప్–2పై హైకోర్టు స్టే
నియామక ప్రక్రియ నాలుగు వారాల పాటు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్:గ్రూప్–2 నియామక ప్రక్రియ,హైకోర్టు ,స్టేరాత పరీక్ష జవాబుల ‘కీ’లో దొర్లిన తప్పులపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామ చంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2015లో జారీ చేసిన ప్రధాన నోటిఫికేషన్, 2016లో ఇచ్చిన అనుబంధ నోటిఫికేషన్‌లను రద్దు చేసి.. తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలం టూ మహబూబ్‌నగర్‌కు చెందిన నరసింహు డు, మరో 17 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. రాతపరీక్ష నిర్వహించాక గత డిసెంబర్‌లో జవాబుల ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసి, అభ్యంతరాలను కోరిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సురేందర్‌రావు కోర్టుకు నివేదిం చారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో టీఎస్‌పీఎస్సీ పలుమార్లు మార్చిన ‘కీ’లను విడుదల చేసిందని.. చివరి ‘కీ’ లోనూ తప్పు లున్నాయని వివరించారు. వాదనలను పరిగ ణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. గ్రూప్–2 నియామక ప్రక్రియను 4వారాల పాటు నిలిపే యాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. విచార ణను రెండు వారాలకు వాయిదా వేశారు.
అర్హతగా ఎందుకు తీసుకోరు?
వ్యవసాయ విస్తరణాధికారి గ్రేడ్–2 పోస్టుల భర్తీకి అర్హతగా ఇంటర్ ఒకేషనల్ కోర్సులను పరిగణనలోకి తీసుకోకపోవడంపై జస్టిస్ రామ చంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు. ఈ పోస్టుల భర్తీలో ఇంటర్ ఒకేష నల్ కోర్సులను అర్హతగా తీసుకునేందుకు వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి తిరస్కరించడా న్ని సవాలు చేస్తూ ఒకేషనల్ విద్యార్థులు, నిరు ద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.