గృహ నిర్మాణాలపై స్టే | Madras High Court Stay home productions | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణాలపై స్టే

Published Wed, Feb 8 2017 2:32 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

Madras High Court Stay home productions

టీనగర్‌: చెన్నై చిట్లపాక్కంకు చెందిన న్యాయవాది ఎస్‌ వైద్యనాథన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్‌లో ఈ విధంగా తెలిపారు. చెన్నై సమీపంలోగల చిట్లపాక్కంలో 80 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉండేదని, ప్రస్తుతం ఈ చెరువు విస్తీర్ణం 20 ఎకరాలకు కుంచించుకుపోయిందని తెలిపారు. ఈ చెరువు స్థలంలో ఆలయాలు, కల్యాణ మండపాలు, గ్రంథాలయం పేరిట అనేక మంది ఆక్రమణలు జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా గృహాలతోపాటు అనేక భవనాలను నిర్మించినట్లు తెలిపారు. ఈ చట్టవిరుద్ధ ఆక్రమణలతో గత 2015 డిసెంబర్‌లో చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తాయని, దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపారు.

నిర్మాణాలపై స్టే: నీటి కాలువలను ఆక్రమించి పలువురు నిర్మాణాలు జరిపారని, అందువల్ల ఈ చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించాలని, మళ్లీ చెరువును పాత స్థితికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ చెరువు ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు స్టే విధించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌ కౌల్, న్యాయమూర్తి ఎం.సుందర్‌ల సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు చిట్లపాక్కం చెరువులో నిర్మాణాలను చేపట్టరాదని స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా ఈ చెరువులో ఆక్రమణ వివరాలను హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయాలంటూ ఉత్తర్వులిచ్చారు.

ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల నష్టం: రాష్ట్రంలోగల 578 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ ఆదాయాన్ని 20 వేల కోట్లకు పెంచే విధంగా 2012లో స్థలాల రీవాల్యుయేషన్‌ను పలు రెట్లకు పెంచారు. అయితే ఇందులో అవకతవకల కారణంగా ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయమే లభిస్తూ వచ్చింది. ఈ కోవలో నాలుగేళ్లలో రూ.40 వేల కోట్ల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇందులో అధికారులు కొందరు తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement