
ద.మ.రైల్వే సీసీఎంగా గణేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా పి.గణేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1983 ఐఆర్‌టీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన.. వివిధ కేడర్‌లలో విధులు నిర్వహించారు.
హుబ్లీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయనను దక్షిణ మధ్య రైల్వేకు బదిలీ చేశారు. మైసూరు, తిరుచిరాపల్లి, మధురై, పాల్ఘాట్, చెన్నై తదితర ప్రాంతాల్లో పని చేశారు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ కలిగిన ఆయన.. గతంలో దక్షిణ మధ్య రైల్వే ఆంధ్ర లలిత కళాసమితి అధ్యక్షులుగా వ్యవహరించారు.