స్టైల్‌గా.. సౌకర్యవంతంగా..
సంప్రదాయం ఉట్టిపడేలా..
అందుబాటులో శారీ డ్రేపింగ్స్..
ఫ్యాషన్ ప్రియులను ఆ‘కట్టుకునే’ మోడల్స్
వరుసగా రెండు పెద్ద పండుగలు వచ్చేస్తున్నాయి. పుట్టినరోజులు, నైట్ పార్టిలు, వార్షికోత్సవాలు తదితర సందర్భాల్లో ధరించే దుస్తులతో నగరవాసులు అత్యాధునిక ఫ్యాషన్‌కు కేరాఫ్ అ‘డ్రెస్’లా మారిపోతారు. అయితే పండుగల సందర్భం మాత్రం పూర్తిగా విభిన్నం. తమ ఫెస్టివల్ లుక్ మోడ్రన్‌గా మెరిపించడంతో పాటు ట్రెడిషన్‌కు కేరాఫ్‌గా కూడా చూపించాలని తపిస్తారు. అలాంటి ఫ్యాషన్ ప్లస్ ట్రెడిషన్ ప్రియులైన నగర యువత కోసం నగరానికి చెందిన హామ్‌స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ పలు సూచనలు అందిస్తోంది.
ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్ ద్వారా శారీ డ్రేపింగ్ స్టైల్స్ ప్రభావితమవుతున్నాయి. ముందుగా కుట్టిన చీరలు, ధోతీ స్టైల్ ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్.. వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్స్‌లో అసిమెట్రికల్ కట్స్, స్ట్రక్చర్డ్ సిల్హౌట్‌లతో సహా పాశ్చాత్య ఫ్యాషన్ మేళవింపులతో విభిన్న రకాల మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి సంప్రదాయ చీరల్ని అత్యాధునికంగా మారుస్తాయి. వీటితోపాటు అనేక రకల సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి..
డిజైనర్స్ సూచనలు..
పండుగ సీజన్‌లో స్టైలి‹Ùగా, సౌకర్యవంతంగా ఉండటానికి లైమ్ గోటా పట్టి ఉన్న చందేరి కార్డ్ సూట్ సెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది మోనోక్రోమాటిక్ లుక్స్‌కి రంగురంగుల వైబ్స్‌ని జోడిస్తుంది.
ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ కో–ఆర్డ్ షరారా పండుగ దుస్తులకు పర్ఫెక్ట్ క్లాసిక్ చిక్ రూపాన్ని అందిస్తుంది.
బ్లేజర్లు కార్పొరేట్ స్టైల్‌కి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఇటీవల ఆల్–టైమ్ ఫేవరెట్‌గా మారాయి. ఒక ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో మేళవించాలి. నడుముకు బెల్ట్‌తో ఏ సమయంలోనైనా ఈ డ్రెస్ బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది.
ఈ నవరాత్రి రోజుల్లో మస్టర్డ్ షరారా చీర ధరిస్తే చాలా స్టైలి‹Ùగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది.
డ్రేప్డ్ బాటమ్‌తో సెట్ చేసే డ్రెస్సులు ఇటీవల ట్రెండ్‌లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఈవెనింగ్ వేర్ కోసం డ్రేప్డ్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ క్రేప్‌తో జత చేయాలి. అదనపు డోస్ కోసం సీక్వెన్స్ జుతీస్ బెస్ట్.
పేస్టెల్, బ్రైట్ కలర్స్‌తో ఓ సరికొత్త చిక్ కాంబినేషన్. ఈ ఆఫ్–వైట్– పింక్ కేడియా టాప్, షెల్– మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షార్ట్ అవుట్‌ఫిట్‌తో ప్రకాశవంతమైన పసుపు ధోతీతో జతగా ధరించవచ్చు.
ఆధునిక– సంప్రదాయాల సమ్మేళనంతో డిజైన్ చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉన్న స్కార్లెట్ సిల్క్ లెహెంగా పలాజో సెట్ ధరిస్తే..కలల రూపం సొంతమవుతుంది..
సల్వార్ కమీజ్ అందంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులతో కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎంచుకోవచ్చు.
వివాహాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చనియా చోళీ ధరిస్తారు. వీటికి ఆధునిక ఉపకరణాలు, ఆభరణాలను జత చేస్తున్నారు. పిల్లల కోసమైతే తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకోవాలి.
పిల్లల దుస్తులను సొంతంగా లేదా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవచ్చు. పిల్లలతో సరిపోలే దుస్తులను ధరించడం వల్ల యూనిక్ ఫ్యామిలీ అనిపించుకోవచ్చు.
పిల్లల దుస్తులు సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేసేటప్పుడు జారిపడకుండా ఉండేలా పొడవును, సౌకర్యాన్ని నిర్ధారించుకోవాలి. ప్రమాదాన్ని కలిగించేలా పదునైన ఉపకరణాలు, ఆభరణాలకు దూరంగా పెట్టాలి.
పురుషుల కోసం..
ఎతి్నక్‌వేర్‌తో పండుగ లుక్‌ను మార్చుకోవాలని భావిస్తే.. కుర్తా కరెక్ట్. ఏ సందర్భానికైనా నప్పే కాలాతీత ఫ్యాషన్‌గా కుర్తాను ఎంచుకోవచ్చు. సరైన రీతిలో ఫిట్ అయ్యే కుర్తా–పైజామా ఎల్లప్పుడూ స్టైలిష్ లుక్‌ని అందిస్తాయి. ఇంకొంచెం కొత్తగా కనిపించాలంటే.. కుర్తాకి నెహ్రూ జాకెట్‌ని జత చేయవచ్చు. మొత్తంగా మెరిపించే సత్తా ఈ కాంబినేషన్‌కి ఉంది. అదే విధంగా షేర్వానీలు కూడా వేడుకలకు నప్పే ఎంపికలు. పండుగలకు ఇవి సరైన ఛాయిస్. అలాగే దీపావళి పారీ్టలకు కూడా కరెక్ట్‌గా నప్పుతాయి. ఎరుపు రంగు షేడ్.. సంప్రదాయ పండుగల్లో చాలా అర్థవంతమైన వర్ణంగా పేర్కొంటారు. నేవీబ్లూ, బ్లాక్, వైట్, ప్లమ్, ఆలివ్ గ్రీన్.. కూడా నప్పే
ఎంపికలే.
యాక్సెసరీస్...
భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు (చెవిపోగులు), బిందీలు, హెయిర్‌పిన్ వంటి తక్కువ బరువున్న వాటిని యాక్సెసరీస్‌గా ఎంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment