జపాన్‌లో హ్యోగో ప్రిఫెక్చర్ మికీ నగరంలో శరత్కాల వేడుకలు ఏటా అక్టోబర్ నెలలో ఘనంగా జరుగుతాయి. ప్రతి అక్టోబర్‌లోనూ ప్రతి ఆదివారం, రెండో శనివారం, మూడో శనివారం రోజుల్లో మికీ నగరంలో భారీగా ఊరేగింపులు, సంప్రదాయ నృత్యగాన ప్రదర్శనలు సందడిగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఓమియా హాచిమన్ ఆలయంలో సామూహిక ప్రార్థనలు జరుగుతాయి.
తమ తమ పొలాల్లో పండిన వరి కంకులను, కాయగూరలను, పండ్లను ఈ ఆలయంలోని దేవతలకు సమర్పిస్తారు. శరత్కాలంలో ఇక్కడ పంటల కోతలు పూర్తవుతాయి. పంటలు చేతికి అందిన సందర్భంగా జపాన్ ప్రజలు సంతోషంగా విదు వినోదాలతో ఘనంగా సంబరాలు జరుపుకొంటారు. జపాన్ రాజధాని టోక్యోలో మరో ఓమియో హాచిమన్ ఆలయం ఉన్నా, శరత్కాల వేడుకల్లో టోక్యోలో ఉన్న ఆలయంలో కంటే మికీలోని ఆలయంలోనే ఎక్కువగా జనసందోహం కనిపిస్తుంది. పురాతన షింటో మతానికి చెందిన ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1111 సంవత్సరంలో నిర్మించారు. తర్వాత ఒక అగ్నిప్రమాదంలో ఆలయానికి నష్టం జరగడంతో 1585లో దీనిని పునర్నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment