
పిల్లల్లో ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించా లని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు సూచించారు. పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

అమరావతి బాలోత్సవం పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద నృత్యం, క్లాసికల్ డాన్స్, ఏక పాత్రాభినయం, లఘు నాటికలు, దేశభక్తి గీతాల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.



























