గోరంట్లలో గోవింద నామస్మరణ | govind name in gorantla | Sakshi
Sakshi News home page

గోరంట్లలో గోవింద నామస్మరణ

Published Sun, Mar 19 2017 10:45 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

గోరంట్లలో గోవింద నామస్మరణ - Sakshi

గోరంట్లలో గోవింద నామస్మరణ

గోరంట్లలో వెలసిన శ్రీలక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

- అశేషజన భక్తజన వాహిని మధ్య మాధవుడి రథోత్సవం 
 
కోడుమూరు రూరల్‌  గోరంట్లలో వెలసిన శ్రీలక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణతో గోరంట్ల గ్రామం మారుమోగిపోయింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా అనంతపురం,  మహబూబ్‌నగర్‌ జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షమందికిపైగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.  సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌ ఎస్‌ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement