
మార్మోగిన గోవింద నామస్మరణ
గుడ్డం రంగనాథస్వామి రథోత్సవం అశేషభక్తజన వాహిణి మధ్య ఆదివారం కనుల పండువగా జరిగింది.
హిందూపురం అర్బన్ : గుడ్డం రంగనాథస్వామి రథోత్సవం అశేషభక్తజన వాహిణి మధ్య ఆదివారం కనుల పండువగా జరిగింది.శ్రీదేవిభూదేవి సమేత రంగనా«థస్వామి ఉత్సవమూర్తుల ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో మూలవిరాట్ రంగస్వామికి అభిషేకాలు, పుష్ప, తులసీ ఆకులతో అర్చన చేశారు. అలాగే విశేష పుష్పాంకరణతో ముస్తబు చేసి వేదపండితుల మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీదేవిభూదేవి రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువుదీర్చి పుర వీధుల్లో ప్రాకారోత్సవం చేశారు. అనంతరం పూజలు చేసి రంగనాథస్వామి గోవిందా.. అంటూ భక్తులు రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసులు, కమిటీ చైర్మన్ మోహన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాము, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ రెహెమాన్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.