ఇక నుంచి నేను ఎమ్మెల్యేను కానట్టే.. | meda mallikarjuna fires on ap government | Sakshi
Sakshi News home page

ఇక నుంచి నేను ఎమ్మెల్యేను కానట్టే..

Published Fri, Apr 3 2015 11:05 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

ఇక నుంచి నేను ఎమ్మెల్యేను కానట్టే.. - Sakshi

ఇక నుంచి నేను ఎమ్మెల్యేను కానట్టే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శుక్రవారం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శుక్రవారం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కల్యాణోత్సవంలో తనను అధికారులు అవమానించారంటూ ఆరోపించారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తన కుటుంబ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వలేదన్నారు.

తన అనుచరులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని మేడా మల్లికార్జునరెడ్డి కంటతడి పెట్టారు. ఇక నుంచి తన శాసనసభ్యుడి కానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ వాహనంతో పాటు గన్మెన్లను కూడా వెనక్కి పంపుతున్నట్లు మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారుల తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే మేడా ఒంటిమిట్ట రథోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement