
నెల్లూరులో పవిత్ర పినాకినీ తీరాన రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉభయదేవేరులతో సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దిన తిరుత్తేరు (రథం)పై కొలువైన రంగనాథుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన అశేష భక్తజనంతో మాడవీధులు పోటెత్తాయి

దాదాపు ఐదున్నర గంటలకు పైగా ఉత్సవం నేత్రపర్వంగా సాగింది













