seetha ramula kalyanam
-
ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది. బుక్ చేసుకున్నవారు రూ.80 చెల్లించాలి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉంటుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్ చేసుకున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు. -
రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం
వేములవాడ: హరిహరక్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాజా తరను తలపించేలా దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. శివపార్వతులు (జోగినులు, హిజ్రాలు) చేతిలో త్రిశూలం పట్టుకుని రాజన్నను వివాహమాడారు. -
నేత్రపర్వం.. సీతారామ కల్యాణం
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తితో గత రెండేళ్లుగా ఆంతరంగికంగానే సాగిన ఈ వేడుక తిరిగి ఎప్పటిలాగానే మిథిలా స్టేడియంలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో కల్యాణ మండపం మార్మోగింది. స్వామి వారి కల్యాణం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. రామయ్యకు సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళా శాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షణ నిర్వహించి కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం రాగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్య పూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం తరఫున ఆలయ వైదిక కమిటీ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ పాల్గొన్నారు. ఇక భద్రగిరి, బాసర అభివృద్ధి:మంత్రి రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యాన భద్రాచలంతోపాటు బాసర క్షేత్రం అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రామయ్య కల్యాణోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. నేడు భద్రాచలానికి గవర్నర్ శ్రీరామ నవమి తర్వాత రామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుక నిర్వహించడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
పాతబస్తీలో ప్రారంభమైన శోభాయాత్ర!
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్ బాగ్, రాణి అవంతీబాయ్ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను సైతం మూసివేయించారు. శోభాయాత్రలో సుమారు లక్షన్నర మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూంలను ఏర్పాటును చేశారు. అదనపు కమిషనర్ షిఖా గోయల్ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు-3, డీఎస్పీలు-4, ఇన్స్పెక్టర్లు-28, ఎస్సైలు-38, హెడ్‌కానిస్టేబుళ్లు-46, కానిస్టేబుళ్లు-86, అదనపు బలగాలు ప్లాటూన్-13, టీయర్‌గ్యాస్ స్క్వాడ్స్-2 బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. -
వైభవం.. ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవిఘ్నాలు చోటుచేసుకోకుండా, ఆలయానికి రక్షణగా ధ్వజస్తంభం వద్ద శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే ధ్వజారోహణంగా వ్యవహరిస్తారు. ఆలయంలో ఉదయం తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన చేశారు. కర్మణ, పుణ్యాహవచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన, తోరణ ఆరాధన నిర్వహించారు. అనంతరం నవాహ్నిక దీక్షకు అగ్ని మథనం గావించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన జరిపి, హోమం చేశారు. గరుడాళ్వార్లకు ప్రత్యేక ఆహ్వానం.. ముందుగా ప్రధాన ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య సమస్త రాజ లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవ మూర్తులైన శ్రీసీతారామ లక్ష్మణ స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షణ చేయించి ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం జరిపి అర్చక, పరిచారక, వేద పండితులు తీసుకొని రాగా.. బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను అర్చకులు పఠించగా, మంగళ వాయిద్య ఘోష నడుమ గరుడ పటాన్ని పైకి ఎగురవేశారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతాన లేని వారికి గరుడ ముద్దలను అందజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. దీంతో ఈ ప్రసాదాలను స్వీకరించేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. అష్టదిక్పాలక, దేవతాహ్వానం గావించారు. ఉత్సవ మూర్తులతో పాటు ఎనిమిది దిక్కులకు బలిహరణం వేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రబాకర శ్రీనివాస్ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇతర అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఎదుర్కోలు ఉత్సవం... స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఎదుర్కోలు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం చతుఃస్థానార్చన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి ఉత్తర ద్వారం ముందు భాగంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం గరుడ సేవ జరపనున్నారు. -
అడవిలో కారు ప్రయాణం
ఏజెన్సీ ఏరియా మీదుగా వరంగల్‌కు సీఎం సాక్షిప్రతినిధి, వరంగల్: గతంలో ఏ సీఎం చేయని విధంగా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్ వరంగల్‌కు వచ్చారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం మణుగూరు మీదుగా ముఖ్యమంత్రి వాహనశ్రేణి రోడ్డు మార్గం లో వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. మణుగూరు నుంచి మహబూబాబాద్, నర్సంపేట మీదుగా వరంగల్‌కు రా వాలని ముందుగా అధికారులు రోడ్‌మ్యాప్ నిర్ణయించారు. ఆఖరు నిమిషయంలో ఈ రూట్ మారింది. కేసీఆర్ వాహనశ్రేణి మణుగూరు నుంచి బయలుదేరగానే మణుగూరు-మంగపేట-ఏటూరునాగారం-వరంగల్ రహదారిలో 100 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రైవేటు వాహనాలను రోడ్డుపైకి రానివ్వలేదు. సీఎం కాన్వాయి ప్రధాన రహదారిపై వస్తున్న క్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు కాన్వాయ్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన ఏటూరునాగారం, ములుగు ఏజెన్సీలో గంటా ఇరవై నిమిషాల పాటు ప్రయాణించారు.