సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి క్షేత్రానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రధానా లయ, ప్రెసిడెన్షియల్ సూట్‌లు, కాటేజీల నిర్మాణ పనులను పరిశీ లిస్తారు. అలాగే ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహా సుదర్శనయాగం కోసం అవసరమైన స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎంరాక సందర్భంగా వైటీడీఏ, జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment