యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయాన్ని బుధవారం వేకువజామున 3 గంటలకు తెరుస్తారు.
విశేష పూజలు: తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం. అనంతరం విశేష పూజాధికాలు. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు స్వామివారికి మధ్యాహ్న రాజభోగం (ఆరగింపు).. ఆలయం మూసివేత. రాత్రి 7 నుంచి 7.30 వరకు తిరువారాధన. 7.30 నుంచి 8.15 వరకు సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన. 9.15 నుంచి 9.45 గంటల వరకు రాత్రి నివేదన (ఆరగింపు). 9.45 నుంచి 10 గంటల వరకు శయనోత్సవం.. ఆలయ ద్వారబంధనం.
సర్వ దర్శనాలు: 6.30 నుంచి 8 గంటల వరకు. తిరిగి 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మళ్లీ 12.45 నుంచి 4 గంటల వరకు, ఆపై సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు..చివరిగా రాత్రి 8.15 నుంచి 9.15 వరకు సర్వ దర్శనాలు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు: ఉదయం 8 నుంచి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు.
16 నుంచి నిత్య కల్యాణాలు!
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో వచ్చే నెల 16 నుంచి నిత్య కల్యాణం, సుదర్శన హోమం, బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పూజలకు సంబంధించి త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం.
యాదాద్రిలో ప్రసాదం కౌంటర్లు ప్రారంభం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనాన్ని ఆలయ ఏఈవో శ్రావణ్ కుమార్ మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. కల్యాణ కట్ట వద్ద ఏర్పాటు చేసే సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయం (సీఆర్‌వో) వద్ద టికెట్లు తీసుకుని, కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రసాదం కౌంటర్లలో ప్రసాదం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మంగళవారం ప్రసాదం కొనుగోలు ద్వారా ఆలయానికి రూ.817,580 ఆదాయం వచ్చింది.
– యాదగిరిగుట
Comments
Please login to add a commentAdd a comment