ధర్మపురి (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపులో రూ. 22,43,723 నగదుతో పాటు,19 గ్రాముల బంగారం, 2.280 గ్రాముల వెండి, విదేశాలకు చెందిన 26 కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.